వనిత లత కవిత పాట లిరిక్స్ | కాంచన గంగ (1984)

 చిత్రం : కాంచన గంగ (1984)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : బాలు


వనిత..లత..కవిత..

మనలేవు లేక జత..

వనిత..లత..కవిత..

మనలేవు లేక జత..

ఇవ్వాలి చేయూత ..

మనసివ్వడమే మమత

మనసివ్వడమే మమత

వనిత..లత..కవిత..

మనలేవు లేక జత..


పూలురాలి నేలకూలి... తీగబాల సాగలేదు..

చెట్టులేక... అల్లుకోక... పూవు రాదు నవ్వలేదు

మోడు మోడని తిట్టుకున్నా... తోడు విడిచేనా?

పులకరించే... కొత్త ఆశ  తొలగిపోయేనా?


వనిత..లత..కవిత..

మనలేవు లేక జత..


ఆదరించే ప్రభుతలేక... కావ్యబాలా నిలువలేదు..

కవిత ఐనా... వనిత ఐనా... ప్రేమలేకా పెరగలేదు..

చేదు చేదని తిట్టుకున్నా చెలిమి విడిచేనా?

చేదు మింగి... తీపి నీకై పంచమరిచేనా?


వనిత..లత..కవిత..

మనలేవు లేక జత..


తనది అన్న..గూడులేక కన్నెబాల బతకలేదు..

నాది అన్న తోడులేక... నిలువలేదు విలువలేదు

పీడ పీడని తిట్టుకున్నా... నీడ విడిచేనా?

వెలుగులోన... నీడలోన నిన్ను మరిచేనా..


వనిత..లత..కవిత

మనలేవు లేక జత

ఇవ్వాలి చేయూత

మనసివ్వడమే మమత

మనసివ్వడమే మమత

 


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)