చిత్రం : డాన్స్ మాస్టర్ (1986)
సంగీతం : ఇళయరాజా
సాహిత్యం : వేటూరి
గానం : చిత్ర
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
నింగి నా ముంగిలై నీటి తోరణాలతో హొయ్
వంగి నా పొంగులే వూగే చుంబనాలతో
కన్ను కన్ను కవ్వింతలో తడిపొడి తుళ్ళింతలో
కసికసి రెట్టింతలో అది ఇది అంటింతలో
సయ్యాటాడే ఒయ్యారాలేమో లేత లేతగా
చేతికందగ జాజి తీగలే నీటి వీణలై
మీటుకున్న పాట చినుకులేరి చీర కట్టగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
మహా సుఖం తడి స్వరం ఇదో రకం చలి జ్వరం
ఫలించెలే స్వయంవరం జ్వలించెలే నరం నరం
నింగే నీలాలు జల్లే కన్నె ప్రేమలో
ప్రేమ యాత్రలో వాన జల్లుగ పూలు రాలిన
మాలి లేడు వాన పూలు ఏరి మాలలల్లగా
వాన మేఘం మైమరపించే జీవం
దేహమంత మోహం ఏమి మాయ దాహం
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon