చిత్రం : రాముడు భీముడు (1964)
సంగీతం : పెండ్యాల నాగేశ్వరరావు
సాహిత్యం : శ్రీశ్రీ
గానం : ఘంటసాల, మాధవపెద్ది సత్యం,పి.సుశీల
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీవంతు అందుకో
ఎందుకో సందేహమెందుకో
రానున్న విందులో నీవంతు అందుకో
ఆ రోజూ అదిగో కలదూ నీ ఎదుట...
నీవే రాజువటా ..ఆఅ..ఆఅ..ఆఅ
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
ఏవిటేవిటేవిటీ మంచికాలమంటున్నావు
ఎలాగుంటుందని విశదంగా చెప్పు
దేశ సంపద పెరిగేరోజు
మనిషి మనిషిగా బ్రతికేరోజు
దేశ సంపద పెరిగేరోజు
మనిషి మనిషిగా బ్రతికేరోజు
గాంధి మహాత్ముడు కలగన్న రోజు
నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు
ఆ రోజెంతో దూరం లేదూరన్నయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆ రోజెంతో దూరం లేదూ రండయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
భలే భలే బాగా సెప్పావ్
కానీ అందుకు మనమేం చేయాలో
అదికూడా నువ్వే చెప్పు
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలసి
అందరికోసం ఒక్కడు నిలిచి
ఒక్కనికోసం అందరు కలసి
సహకారమే మన వైఖరి ఐతే
ఉపకారమే మన ఊపిరి ఐతే
పేద గొప్పా భేదం పోయీ అందరూ
నీది నాదని వాదం మాని ఉందురూ
ఆ రోజెంతో దూరం లేదూ రన్నయ్యో
అదిగో చూడు రేపే నేడు చిన్నయ్యో
ఆఆ.ఆ..ఆఆఅ..ఆఅ..ఆఆ..
ఆఆఅ.ఆఆఅ..ఆ..ఆఆ
తీయగా బ్రతుకంతా మారగా
కష్టాలు తీరగా సుఖశాంతులూరగా
ఆకాశ వీధుల ఎదురే లేకుండా
ఎగురును మన జెండా
ఆఆఅ..
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే మంచికాలం ముందు ముందునా
అందరూ సుఖపడాలి నందనందనా
ఉందిలే...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon