చిత్రం : స్వాతికిరణం (1992)
సంగీతం : కె.వి. మహదేవన్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : వాణీజయరాం
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
ఈ పూల రాగాల పులకింత గమకాలు
గారాబు కవనాల గాలి సంగతులు
నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు
పల్లవించును ప్రభూ పవళించు భువనాలు
భాను మూర్తీ.. నీ ప్రాణకీర్తన విని..
పలుకనీ ప్రణతులనీ ప్రణవ శృతినీ..
పాడనీ ప్రకృతినీ ప్రథమ కృతిని
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు
నీ రాజసానికవి నీరాజనాలు
పసరు పవనాలలో.. పసికూన రాగాలు
పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు..
తాలయూర్చు.. తలిరాకు బహుపరాకులు విని..
దొరలనీ దోర నగవు దొంతరనీ
తరలనీ దారి తొలగి రాతిరిని
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
ఇల గొంతు వొణికింది.. పిలుపు నీయనా ప్రభూ
నీ దోవ పొడవునా.. కువకువలా స్వాగతము
నీ కాలి అలికిడికి.. మెలకువల వందనము
తెలి మంచు కరిగింది.. తలుపు తీయనా ప్రభూ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon