సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట పాట లిరిక్స్ | దళపతి(1992)

 చిత్రం : దళపతి(1992)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : రాజశ్రీ

గానం : బాలసుబ్రహ్మణ్యం, చిత్ర


సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా


అనుకున్న మాటలు సర్వం కరిగిపోతే న్యాయమా

మధురాల మధువులు చింది చల్లని ప్రేమే మాయమా

ఆఆ...రేపవలు నిద్దరలోను యద నీ తోడే కోరును

యుద్ధాన యేమైనా నా ఆత్మే నిన్నే చేరును

యద తెలుపు ఈ వేళ యేల ఈ శోధన

జాబిలిని నీవడుగు తెలుపు నా వేదన

నాలో ప్రేమే మరిచావు

ప్రేమే నన్నే గెలిచేనే

 

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా


పువ్వులే ముళ్ళై తోచు నీవే నన్ను వీడితే

ఊహలే పూలై పూచు నీ యద మాటున చేరితే

ఆఆఅ.. మాసాలు వారాలౌను నీవూ నేనూ కూడితే

వారాలు మాసాలౌను మాటే మారి సాగితే

పొంగునే బంధాలే నీ దరి చేరితే

గాయాలు ఆరేను నీ యెదుట వుంటే

నీవే కదా నా ప్రాణం

నీవే కదా నా లోకం


సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా

గుండెలో నిండమంట నీడగా పాడమంట నా సిరి నీవేనట

సుందరి నేనే నువ్వంట చూడనీ నీలో నన్నంట

కానుకే ఇచ్చా మనసంతా జన్మకే తోడై నేనుంటా 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)