శ్రీ లక్ష్మీ జయలక్ష్మీ పాట లిరిక్స్ | లక్ష్మీ పూజ (1979)

 చిత్రం : లక్ష్మీ పూజ (1979)

సంగీతం : సత్యం

సాహిత్యం :  వీటూరి

గానం : జానకి


శ్రీ లక్ష్మీ... జయలక్ష్మీ.. 

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ

కరుణించ రావే మహాలక్ష్మీ

మము కరుణించ రావే మహాలక్ష్మీ

సిరులను కురిపించే శ్రీలక్ష్మీ

కరుణించ రావే మహాలక్ష్మీ

మము కరుణించ రావే మహాలక్ష్మీ


పాలకడలిలో ప్రభవించినావు

మురిపాల మాధవుని వరియించినావు

పాలకడలిలో ప్రభవించినావు

మురిపాల మాధవుని వరియించినావు

శ్రీపతి హృదయానా...

శ్రీపతి హృదయాన కొలివైతివమ్మా

నా పతి పాదాల నను నిలుపవమ్మా


సిరులను కురిపించే శ్రీలక్ష్మీ

కరుణించ రావే మహాలక్ష్మీ

మము కరుణించ రావే మహాలక్ష్మీ


అన్ని జగాలకు మూలము నీవే ఆదిలక్ష్మివమ్మా

పాడిపంటలను ప్రసాదించు నవ ధాన్యలక్ష్మివమ్మా

భీరులనైనా ధీరులజేసే ధైర్యలక్ష్మివమ్మా

జగతికి జయమును కలిగించే గజలక్ష్మివి నీవమ్మ

వంశము నిలిపే పాపలనిడు సంతానలక్ష్మివమ్మా

కార్యములన్నీ సఫలము జేసే విజయలక్ష్మివమ్మా

జనులకు విధ్యాభుద్దులు నేర్పే విద్యాలక్ష్మి నీవమ్మా

సర్వ సౌభాగ్యములను సంపదనిచ్చే భాగ్యలక్ష్మివి నీవమ్మా


సిరులను కురిపించే శ్రీలక్ష్మీ

కరుణించ రావే మహాలక్ష్మీ

మము కరుణించ రావే మహాలక్ష్మీ


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)