శంబో శివ శంబో పాట లిరిక్స్ | శంబో శివ శంబో (2010)

 చిత్రం : శంబో శివ శంబో (2010)

సంగీతం : సుందర్ సి బాబు

సాహిత్యం : చిన్నిచరణ్

గానం : శంకర్ మహదేవన్


శంబో శివ శంబో... శివ శివ శంబో...

శంబో శివ శంబో... శివ శివ శంబో...

ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ

నీళ్ళకి బదులు నిప్పులు రానీ

పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపర ధైర్యాన్ని

నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ

స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్దాన్ని

 

శంబో శివ శంబో... శివ శివ శంబో...

శంబో శివ శంబో... శివ శివ శంబో...


నువ్వెవరు నేనేవరంటు తేడాలే లేకపోతే

లోకం లో శోకం లేదు మనుషుల్లో లోపం లేదు

చీకటిలో విడిపోతుంది నీ నీడే నిన్నొంటరిగా

డబ్బుల్లో భాదల్లోను విడిపోనిది స్నేహమేగా

ప్రపంచమే తల కిందయినా

ప్రేమ వెంట స్నేహం వుంటే విజయమే


శంబో శివ శంబో... శివ శివ శంబో...

శంబో శివ శంబో... శివ శివ శంబో...


ఉరిమే మబ్బులు ఉప్పెన కానీ

నీళ్ళకి బదులు నిప్పులు రానీ

పిడికిలి వదలకు పిడుగులు పడనీ చూపర ధైర్యాన్ని

నరాలు తెగిపడి నెత్తురు రానీ నర మేధాలే జరిగిన గానీ

స్నేహం కోసం ప్రాణం పోనీ చెయ్యర యుద్దాన్ని

శంబో శివ శంబో... శివ శివ శంబో...

శంబో శివ శంబో... శివ శివ శంబో...


కామంతో కలిసే ప్రేమ కలకాలం నిలబడుతుందా

నదిలోన ముగ్గే పెడితే క్షణమైనా నిలిచుంటుండా

ప్రేమన్నది దైవం లేరా స్నేహం తన రూపమేనురా

మీ ఆశలు తీర్చుకొనుటకు ఆ ముసుగులు వేసుకోకురా

స్నేహానికి జన్మ హక్కురా నీ తప్పు ఒప్పును దిద్దే బాద్యత


సంద్రం రౌద్రం అవుతుందేంటి

మంచే అగ్నిగ మారిందేంటి

ప్రేమ కి గ్రహణం పడుతుందేంటి బదులే రాదేంటి

దిక్కులు దిశలే మరాఏంటి

పడమట సూర్యుడు పోడిచాడేంటి

గుండెల్లో ఈ గునపాలేంటి అసలీ ఈ కథ ఏంటి

శంబో శివ శంబో... శివ శివ శంబో...

శంబో శివ శంబో... శివ శివ శంబో...

 

Share This :



sentiment_satisfied Emoticon