రామచిలక పెళ్ళికొడుకెవరే పాట లిరిక్స్ | రామచిలక (1978)

 చిత్రం : రామచిలక (1978)

సంగీతం : సత్యం

సాహిత్యం : వేటూరి

గానం : జానకి


రామచిలక పెళ్ళికొడుకెవరే

మాఘమాసం మంచి రోజు

మనువాడే పెళ్ళికొడుకెవరే


రామచిలక పెళ్ళికొడుకెవరే

మాఘమాసం మంచి రోజు

మనువాడే పెళ్ళికొడుకెవరే


ఏరులాంటి వయసు

ఎల్లువైన మనసు

ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో

ఏరులాంటి వయసు

ఎల్లువైన మనసు

ఎన్నెలంటి వన్నె చూసిఎవరొస్తారో

తుళ్ళిపడకే..కన్నె పువ్వా

తుమ్మెదెవరో రాకముందే

ఈడు కోరే తోడుకోసం

గూడు వెతికే కన్నెమొలక


రామచిలక పెళ్ళికొడుకెవరే

మాఘమాసం మంచి రోజు

మనువాడే పెళ్ళికొడుకెవరే


ఊరుదాటే చూపు

చూపు దాటే పిలుపు

ఆరుబైట అందమంతా

ఆరబోసేనే....

ఊరుదాటే చూపు

చూపు దాటే పిలుపు

ఆరుబైట అందమంతా

ఆరబోసేనే..

గోరువంకా..

గోరువంక దారివంక

కోరుకున్న జంట కోసం

ఆశలెన్నో అల్లుకున్న

అంతలోనే ఇంత ఉలుకా


రామచిలక పెళ్ళికొడుకెవరే

మాఘమాసం మంచి రోజు

మనువాడే పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే

రామచిలక పెళ్ళికొడుకెవరే

Share This :



sentiment_satisfied Emoticon