ప్రేమ యాత్రలకు బృందావనము పాట లిరిక్స్ | గుండమ్మ కథ (1962)

 


చిత్రం : గుండమ్మ కథ (1962)

సంగీతం : ఘంటసాల

సాహిత్యం : పింగళి నాగేంద్ర రావు

గానం : ఘంటసాల, సుశీల




ప్రేమ యాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

ఆహాహా ఆహాహా హా

కులుకులొలుకు చెలి చెంతనుండగా వేరే స్వర్గము ఏలనో

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో

ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో

ఆహాహా ఆహాహా హా

ప్రేమించిన పతి ఎదుటనుండగా వేరే దైవము ఏలనో

తీర్ధయాత్రలకు రామేశ్వరము కాశీ ప్రయాగలేలనో


చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా

ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా

చెలి నగుమోమే చంద్రబింబమై పగలే వెన్నెల కాయగా

సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా

ఆహాహా ఆహాహా హా

సఖి నెరిచూపుల చల్లదనంతో జగమునే ఊటీశాయగా


ప్రేమ యాత్రలకు కొడైకెనాలు కాశ్మీరాలు ఏలనో


కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా

ఆహాహా ఆహా ఆహాహా ఆహాహా హా

కన్నవారినే మరువజేయుచు అన్ని ముచ్చటలు తీర్చగా

పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

ఆహాహా ఆహాహాహా

పతి ఆదరణే సతికి మోక్షమని సర్వశాస్త్రములు చాటగా

తీర్ధయాత్రలకు కైలాసాలు వైకుంఠాలూ ఏలనో


అన్యోన్యంగా దంపతులుంటే భువికి స్వర్గమే దిగిరాదా

ప్రేమయాత్రలకు బృందావనము నందనవనము ఏలనో

Share This :



sentiment_satisfied Emoticon