చిత్రం : జనతాగ్యారేజ్ (2016)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : శంకర్ మహదేవన్
తోం.. ధిరననన ధిర ధిర న
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా..
తోం.. ధిరననన ధిర ధిర న
తోం.. ధిరననన ధిర ధిర న
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ప్రమోదం ప్రమోదం ప్రమోదం
ప్రతి సృష్టి చిత్రం ప్రమోదం
ప్రయాణం ప్రయాణం ప్రయాణం
విశ్వంతో మమేకం ప్రయాణం
తోం.. ధిరననన ధిర ధిర న
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా..
మన చిరునవ్వులే పూలు
నిట్టూర్పులు తడి మేఘాలు
హృదయమే గగనం రుధిరమె సంద్రం ఆశే పచ్చదనం
మారే ఋతువుల వర్ణం
మన మనసుల భావోద్వేగం
సరిగా చుస్తే ప్రకృతి మొత్తం మనలో ప్రతి బింబం
నువ్వెంత నేనెంత రవ్వంత
ఎన్నో ఏళ్ళదీ సృష్టి చరిత
అనుభవమే దాచింది కొండంత
తన అడుగుల్లో అడుగేసి వెళదాం జన్మంతా
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
ఎవడికి సొంతమిదంతా
ఇది ఎవ్వడు నాటిన పంట
ఎవడికి వాడు నాదే హక్కని చెయ్యేస్తే ఎట్టా
తరములనాటి కధంతా
మన తదుపరి మిగలాలంటా
కదపక చెరపక పది కాలాలిది కాపాడాలంటా
ప్రేమించే పెద్దమ్మే ఈ విశ్వం
ఇష్టంగా గుండెకు హత్తుకుందాం
కన్నెర్రయితే నీరై ఓ కొంచెం
తల్లడిల్లిందో ఈ తల్లి ఏ ఒక్కరు మిగలం
ప్రణామం ప్రణామం ప్రణామం
ప్రభాత సూర్యుడికి ప్రణామం
ప్రణామం ప్రణామం ప్రణామం
సమస్త ప్రకృతికి ప్రణామం
తోం.. ధిరననన ధిర ధిర న
తోం.. ధిరననన ధిర ధిర న
తోం. ధిరన తోం ధిరన ధీర ధీర నానా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon