పదే పదే పాడుతున్నా పాట లిరిక్స్ | సీతామాలక్ష్మి (1978)

 చిత్రం : సీతామాలక్ష్మి (1978)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : వేటూరి

నేపధ్య గానం  : సుశీల


పదే పదే పాడుతున్నా... పాడిన పాటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే

అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే


పదే పదే పాడుతున్నా... పాడిన పాటే

అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే 


ఇది అనగనగ కథ కాదు.. అందమైన జీవితం

కన్నె వయసు చిలకమ్మ.. వెన్న మనసు గోరింక..

కలసి కట్టుకొన్న కలల గూడు.. ఒకనాడు.. 


చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...

గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి

చిలకమ్మా ఎగిరిపొయే గోరింకను విడిచీ...

ఆ.ఆ. గోరింకా కన్నీరింకా... వగచే ఇది తలచి


ఆమనులే వేసవిలైతే ఎవరిని అడగాలి

దీవెనలే శాపాలైతే ఎందుకు బ్రతకాలి

మనసన్నది చేయని పాపం.. మనసివ్వడమే ఒక నేరం

మనిషైనా మాకైనా.. అనుభవమొకటే..ఏ..ఏ...


పదే పదే పాడుతున్నా పాడిన పాటే....

అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే


రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే

రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే...

రామా లీల ప్రేమజ్వాలా రగిలిన బ్రతుకేలే

ఆ..ఆ...రాలు పూత బంగరు సీత మిగిలిన వలపేలే


మనసు పడ్డ మనిషే దేవుడు శిలగా నిలిచాడూ...

చూపులకే ఊపిరి పోసి చీకటి కొలిచాడూ...

ఎడారిలో కోయిల ఉన్నా ఆ దారిని రాదు వసంతం...

మనిషైనా మాకైనా.. అనుభవమొకటే...


పదే పదే పాడుతున్నా పాడిన పాటే...

అది బ్రతుకో... పాటో.. నాకే తెలియదు పాడుతు ఉంటే

పదే పదే పాడుతున్నా... పాడిన పాటే...


Share This :



sentiment_satisfied Emoticon