ఓ మహాత్మా.. ఓ మహర్షి.. పాట లిరిక్స్ | ఆకలి రాజ్యం (1981)

 చిత్రం : ఆకలి రాజ్యం (1981)

సంగీతం : ఎమ్మెస్ విశ్వనాథన్

సాహిత్యం : శ్రీశ్రీ

గానం : బాలు 


ఓ మహాత్మా.. ఓ మహర్షి..


ఏది చీకటి ఏది వెలుతురు

ఏది జీవితమేది మృత్యువు

ఏది పుణ్యం ఏది పాపం

ఏది నరకం ఏది నాకం

ఏది సత్యం ఏదసత్యం

ఏదనిత్యం ఏది నిత్యం

ఏది ఏకం ఏదనేకం

ఏది కారణమేది కార్యం


ఓ మహాత్మా.... ఓ మహర్షి


ఏది తెలుపు ఏది నలుపు

ఏది గానం ఏది మౌనం

ఏది నాది ఏది నీది

ఏది నీతి ఏది నేతి

నిన్న స్వప్నం నేటి సత్యం

నేటి ఖేదం రేపు రాగం

ఒకే కాంతి ఒకే శాంతి


ఓ మహర్షీ.... ఓ మహాత్మా...


Share This :



sentiment_satisfied Emoticon