చిత్రం : అఖండుడు (1970)
సంగీతం : టి.చలపతి రావు
సాహిత్యం : దాశరధి
గానం : పి.బి.శ్రీనివాస్
ఓ..ఓ..ఓ..ఓ..ఓఓ..
ఓ..హో..హో..ఒ ఒ ఒ ఊ
ఒ ఒ ఒ ఊ..మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
హంస..నడలదానా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నా వలపు..తెలుపుకోనా
నీ మనసు..తెలుసుకోనా
నీ పెదవిపై..చిరునవ్వునై
నీ పెదవిపై..చిరునవ్వునై
కలకాలం..ఉండిపోనా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నీ సొంపులు చూసి..నీ సొగసులు చూసి
నీ సొంపులు చూసి..సొగసులు చూసి
నా మది తొందర చేసే..
నీ మోములో ఒక జాబిలి..
నీ మోములో..ఓ..ఒక జాబిలీ
నా కన్నుల వెన్నెల..సొగసే
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నీ చల్లని మాటే..ఒక కమ్మని పాటై
నీ చల్లని మాటే కమ్మని పాటై
వినిపించెను నా నోట..
నా రాగమే అనురాగమై..
నా రాగమే..ఏ..అనురాగమై
వేసింది పూలబాట
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
నా వలపు..తెలుపుకోనా
నీ మనసు..తెలుసుకోనా
నీ పెదవిపై..చిరునవ్వునై
నీ పెదవిపై..చిరునవ్వునై
కలకాలముండిపోనా
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
ఒక తీయని స్వప్నం..అది మలచిన శిల్పం
ఒక తీయని స్వప్నం..మలచిన శిల్పం
నాలో నిలచిన..రూపం
ఈ రూపమే..నా మనసులో
ఈ రూపమే..ఏ..నా మనసులో
వెలిగించెను..రంగుల దీపం
ఓ..హంస..నడలదానా
అందాల..కనులదానా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon