ఓం శాంతి ఓం శాంతి పాట లిరిక్స్ | ఛాలెంజ్ (1984)

 చిత్రం : ఛాలెంజ్ (1984),

రచన : వేటూరి

సంగీతం : ఇళయరాజా

గానం : బాలు, జానకి


ఓం శాంతి ఓం శాంతి... వయ్యారి వాసంతీ...

నీ ఈడులో ఉంది వేగం.. హ్హ నీ తోడు నాకుంది భాగం

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం 

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం 

ఓం శాంతి ఓం శాంతి... నీదేలే పూబంతీ...

 

ఒంపు ఒంపునా హంపి శిల్పమే చూశా... కన్నేశా

ఆ... లేతనడకలో హంసగమనమే చూశా... కాజేశా

కన్నె నడుమా కల్పనా కవులు పాడే కావ్యమా

కదిలివచ్చే శిల్పమా కరిగిపోని స్వప్నమా

నీ ఊహలో ఇలా ఉప్పొంగినా అలా...

ఉయ్యాలలూగే యవ్వనాల నవ్వులన్నీ నీవే కాదా

 

ఓం శాంతి ఓం శాంతి... వయ్యారి వాసంతీ...

నీ చూపు నా పూలబాణం.. నీ ఊపిరే నాకు ప్రాణం

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం 

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం

ఓం శాంతి ఓం శాంతి... నీదేలే పూబంతీ...


నీలవేణిలో కృష్ణవేణినే చూశా ముడివేశా

ఆ... పడతి కొంగులో కడలి పొంగులే చూశా... చుట్టేశా

మేని విరుపా మెరుపులా ఆ... బుగ్గ ఎరుపా వలపులా

నీలికనులా పిలుపులా మత్తులా మైమరపులా

నీ చూపుతో ఇలా వేశావు సంకెలా

ఇన్నాళ్ల నించీ వేచివున్నా వెన్నెలంతా నీదే కాదా


ఓం శాంతి ఓం శాంతి... వయ్యారి వాసంతీ...

నీ ఈడులో ఉంది వేగం.. నీ తోడు నాకుంది భాగం

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం 

చాంకుచక్ చక చాం చక చంచక చక్‌చక చాం


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)