ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా పాట లిరిక్స్ | విశ్వరూపం (2013)

 


చిత్రం : విశ్వరూపం (2013)

సంగీతం : శంకర్ ఎహసాన్ లాయ్

రచన : రామజోగయ్య శాస్త్రి

గానం : సూరజ్ జగన్


ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే

మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం

రూపం రూపం రూపం

అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే

లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం

రూపం రూపం రూపం


ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే

ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే

చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే

సమయము చూసి ముప్పును ముంచే

ప్రళయపు ముఖమితడే


ఒక్కడంటే ఒక్కడే ఎక్కడైనా ఒక్కడే

మండుతున్న సూర్యుడే ఈ మగాడి ప్రతిరూపం

రూపం రూపం రూపం

అడ్డు ఆపు చూడడే అంచనాలకందడే

లావా లాంటి తాకిడే ఈ మగాడి ప్రతిరూపం

రూపం రూపం రూపం


విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం


నిప్పుల్లోని తీక్షణై సత్తువున్న లక్ష్యమై

చీకటంత చీల్చుతుంది ఈ మగాడి సొంత రూపం

ఏ క్షణాన ఏ రకం మార్చుతుందో వాలకం

మాటకైన చెప్పదే ఈ మగాడి విశ్వరూపం


ఒదిగితే అణువితడే చెలరేగితే జగమితడే

ఎదిగిన కొలదీ ఎల్లలు దాటే మూడవ అడుగితడే

చెరగని మెరుపితడే భయమెరుగని గెలుపితడే

సమయము చూసి ముప్పును ముంచే

ప్రళయపు ముఖమితడే


రూపం రూపం రూపం

రూపం రూపం రూపం

రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

విశ్వ రూపం రూపం రూపం

Share This :



sentiment_satisfied Emoticon