ఒక పూల బాణం తగిలింది పాట లిరిక్స్ | ఆత్మ గౌరవం (1966)

 చిత్రం : ఆత్మ గౌరవం (1966)

సంగీతం : సాలూరి రాజేశ్వర్ రావు

సాహిత్యం : దాశరథి

గానం : ఘంటసాల, సుశీల


ఒక పూల బాణం తగిలింది మదిలో 

తొలి ప్రేమ దీపం వెలిగింది లే

నాలో వెలిగింది లే


ఒక పూల బాణం తగిలింది మదిలో 

తొలి ప్రేమ దీపం వెలిగింది లే

నాలో వెలిగింది లే


అలనాటి కలలే ఫలియించే నేడే 

అలనాటి కలలే ఫలియించే నేడే

మనసైన వాడే మనసిచ్చి నాడే 

ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి 

ఈ ప్రేమ లో లోకమే పొంగి పోయి 

వసంతాల అందాలా ఆనందాల ఆడాలొయి


ఒక పూల బాణం తగిలింది మదిలో 

తొలి ప్రేమ దీపం వెలిగింది లే

నాలో వెలిగింది లే


ఏ పూర్వ బంధమో అనుబంధమాయె 

ఏ పూర్వ బంధమో అనుబంధమాయె 

అపురూప మైన అనురాగ మాయె

నీ కౌగిటా హాయిగా సోలిపోయి

నీ కౌగిటా హాయిగా సోలిపోయి

సరదాల ఉయ్యాల ఉల్లాసం గా వూగాలోయి


ఒక పూల బాణం తగిలింది మదిలో 

తొలి ప్రేమ దీపం వెలిగింది లే

నాలో వెలిగింది లే 


Share This :



sentiment_satisfied Emoticon