నువ్వేం మాయ చేశావో గాని పాట లిరిక్స్ | ఒక్కడు (2003)

 చిత్రం : ఒక్కడు (2003)

సంగీతం : మణిశర్మ

సాహిత్యం : సిరివెన్నెల

గానం : కార్తీక్, శ్రేయా ఘోషల్


నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ

నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ


హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని

రేయి చాటు రాగం విని

ఎవరు తనని పిలిచారని 

అడిగి చూడు నీ మనసుని

హే కాలాన్నే కదలనీయని

కనికట్టేం జరగలేదని

ఈ తీయని మాయ 

తనదని తెలుసా అని

 

మనసూ నీదే మహిమా నీదే

పిలుపూ నీదే బదులూ నీదే


నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ

నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ


మూగ మనసిది ఎంత గడుసిది

నంగనాచి సంగతులెన్నో వాగుతున్నది

ఓహో ఇంత కాలము కంటి పాపలో

కొలువున్న కల నువ్వే అంటున్నది


హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని

రేయి చాటు రాగం విని

ఎందుకులికి పడుతోందని

అడిగి చూడు నీ మనసుని

హే నిదురించే నీలి కళ్ళలో

కల ఎప్పుడు మేలుకున్నదో

ఆ కల ఏం వెతుకుతున్నదో 

తెలుసా అని


కనులూ నీవే కలలూ నీవే

పిలుపూ నీదే బదులూ నీదే


నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ

నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ


పిచ్చి మనసిది హా.. ఎంత పిరికిది

నచ్చుతానో లేదో నీకు అడగమన్నది

ఓహో ఆశ ఆగక అడుగు సాగక

అలలాగా ఎగిరెగిరి పడుతున్నది


హాయ్‌రే హాయ్‌రే హాయ్ అందని

రేయి చాటు రాగం విని

గాలి పరుగు ఎటువైపని

అడిగి చూడు నీ మనసుని

హేయ్ ఏ దారిన సాగుతున్నదో

ఏ మజిలీ చేరుకున్నదో

ఏ తీరం కోరుతున్నదో 

తెలుసా అనీ


పదమూ నీదే పరుగూ నీదే

పిలుపూ నీదే బదులూ నీదే


నువ్వేం మాయ చేశావో గాని

ఇలా ఈ క్షణం ఆగిపోనీ

నువ్వేం మాయ చేశావో గాని

అహాహాహ..మ్మ్..ఆహ..

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)