నిన్ను కోరీ వర్ణం వర్ణం పాట లిరిక్స్ | ఘర్షణ (1988)

 చిత్రం : ఘర్షణ (1988)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : రాజశ్రీ

గానం : చిత్ర


నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే

రవికుల రఘురామా అనుదినము

నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం


ఉడికించే చిలకమ్మ నిన్నూరించే

ఒలికించే అందాలే ఆలాపించే

ముత్యాలా బంధాలే నీకందించే

అచ్చట్లూ ముచ్చట్లూ తానాశించే

మోజుల్లోన చిన్నదీ నీవే తాను అన్నదీ

కలలే విందు చేసెనే నీతో పొందు కోరెనే

ఉండాలనీ నీతోడు చేరిందిలే ఈనాడు సరసకు


నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే

రవికుల రఘురామా అనుదినము

నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం


ఈవీణా మీటేదీ నీవేనంటా

నా తలపూ నా వలపూ నీదేనంటా

పరువాలా పరదాలూ తీసేపూటా

కలవాలీ కరగాలీ నీలోనంటా

పలికించాలి స్వాగతం పండించాలి జీవితం

నీకూ నాకు ఈ క్షణం కానీ రాగ సంగమం

నీ జ్ఞాపకం నాలోన సాగేనులే ఏవేళ సరసకు


నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం

ఉరికిన వాగల్లే తొలకరి కవితల్లే

తలపులు కదిలేనే చెలిమది విరిసేనే

రవికుల రఘురామా అనుదినము

నిన్ను కోరీ వర్ణం వర్ణం

సరి సరి కలిసేనే నయనం నయనం


 

Share This :



sentiment_satisfied Emoticon