కోలాటం పాట లిరిక్స్

కితకు తైయకు తాధిమ తఝంత తకధిమి
తళాంగు తధిగిణు తళాంగు తధిగిణు

నీళ్ళాకుబోయేటి ఓ నీలవేణిరో
నిలచుండవే గొల్లభామ నేను
నీకొఱకు వస్తిని లేమ

నిలచుండమని నన్ను నేర్పుతో నడిగేవు
నీకేమి పనిగల్గె కృష్ణ
నిజముగ దెల్పరాదోయి

పనియేమి యని నన్ను పాటించియడిగేవు
పని నీకు తెలువదె భామ
ఇంత పసిబాలవా ముద్దలేమ

తెలిసిందిగాని నాకు తెచ్చి యేమిచ్చెదవు
తేటగ తెల్పరాదోయి కృష్ణ
మాటన్న నిలుపరాదోయి

మచ్చు చూచుకొని మాలైన నేగొంటె
మచ్చన్న జూపవె భామ
ఇంత మరుగెందుకే గొల్లలేమ

పెండ్లిచేసుకొన్న పెనిమిటి యిదివరకు
పేరన్న పెట్టలేదోయి కృష్ణ
దారన్న జూపలేదోయి

వద్దేల సుద్దేల వందనమదియేల
ఒద్దికగా రావె ఓ భామ
ఒక్కసారి ముద్దియ్యవె ఓలేమ

ముద్దు లిచ్చుటకు పెద్దదాననుగాను
పెద్దగ రట్టాయెనోయి నా
పెద్దబావ కెరుకాయెను
Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)