నెలరాజా పరుగిడకు పాట లిరిక్స్ | అమరగీతం (1982)

 చిత్రం : అమరగీతం (1982)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి 

గానం : బాలు


నెలరాజా పరుగిడకు

చెలివేచే నాకొరకు

ఒక్కమారు పోయి

చెలినిగాంచుమా

నివేదించుమా విరహమే 


నెలరాజా పరుగిడకు

చెలివేచే నాకొరకు

ఒక్కమారు పోయి

చెలినిగాంచుమా

నివేదించుమా విరహమే

నెలరాజా పరుగిడకు

చెలివేచే నాకొరకు


మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం

ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి పరువం

మబ్బులలో తళుకుమనే మెరుపేలే చెలి అందం

ముచ్చటగా ముత్యం లా మెరిసిపడే సఖి పరువం

వాడిపోనిదీ వనిత యవ్వనం

ఆడిపాడితే కనుల నందనం

అణువణువు విరిసేలే లావణ్యం


నెలరాజా పరుగిడకు

ఒక్కమారు పోయి

చెలినిగాంచుమా

నివేదించుమా విరహమే

నెలరాజా పరుగిడకు 


ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము

మురిపెంగా తమ రాకా నా చెలితో తెలిపేనూ

ముంగిటనే రాచిలుకా పలికేనూ స్వాగతము

మురిపెంగా తమ రాకా నా చెలితో తెలిపేనూ

కొండవాగులా మల్లెతీగలా

పులకరించినా సన్నజాజిలా

విరహిణిలా వేచేను జవరాలే


నెలరాజా పరుగిడకు

చెలివేచే నాకొరకు

ఒక్కమారు పోయి

చెలినిగాంచుమా

నివేదించుమా విరహమే 

నెలరాజా పరుగిడకు

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)