చిత్రం : మదనకామరాజు కథ(1962)
సంగీతం : రాజన్-నాగేంద్ర
సాహిత్యం : జి.కృష్ణమూర్తి
గానం : పీ బీ శ్రీనివాస్, సుశీల
నీలి మేఘమాలవో నీలాలతారవో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
నీలి మేఘమాలవో..
మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్ మ్మ్
నీలి మేఘమాలనో నీలాల తారనో
నా సోయగాలతో మదినీ దోచిపోతినో
నీలి మేఘమాలనో..
నీ రాక కోసమే చెలీ..నే వేచి యుంటినే
ఆరాటమేలనో ప్రియా..నే చెంతనుంటినే
ఆనంద మధుర గీతములా..ఆలపింతమా
నీలి మేఘమాలనో..
చివురించు వలపు తీవెలా..విరిపూలు పూయగా
చిరునవ్వు విరుపు లోపలా..హరివిల్లు విరియగా
నెలవంక నావలోన మనమూ..కలసి పోదమా
నీలి మేఘమాలవో..
మనలోని కలత మాయమై..మన ఆశ తీరెగా
అనురాగ రాగమే ఇక..మన రాగమాయేగా
మనసార ప్రేమ మాధురులా..సాగిపోదమా
నీలి మేఘమాలనో నీలాల తారనో
నీ సోయగాలతో మదినీ దోచిపోదువో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon