నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో పాట లిరిక్స్ | మూడుముళ్ళు (1983)

 చిత్రం : మూడుముళ్ళు (1983)

సంగీతం : రాజన్-నాగేంద్ర

సాహిత్యం : ఆరుద్ర

గానం : బాలు, సుశీల


నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో


నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో


లాలాలాల..లాల్లలలా..లాలాలాల..లాల్లలలా

లాలాలాల..లాలా...


అటు చూడకు జాబిలి వైపు

కరుగుతుంది చుక్కలుగా

చలి చీకటి చీర లోనే సొగసంతా దాచుకో

అటు వెళ్ళకు దిక్కుల వైపు కలుస్తాయి ఒక్కటిగా

నా గుప్పెడు గుండె లోనే జగమంతా ఏలుకో

నా హృదయం టూ-లెటు కాదు 

మన జంటకి డ్యూయెటు లేదు

ఆ మాటే విననూ..మాట పడనూ..ఊరుకోను


నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో


అటు చూడకు లోకం వైపు 

గుచ్చుతుంది చూపులతో

ఒడి వెచ్చని నీడ లోనే బిడియాలని పెంచుకో

అటు వెళ్ళకు చీకటి వైపు అంటుతుంది ఆశలతో

విరి శయ్యల వేడి లోనే పరువాలను పంచుకో

నా కొద్దీ కసి కాలేజీ మానేస్తా నే మ్యారేజి

మరులన్నీ మనవీ అన్న మనవే చేసుకున్నా


నీ కోసం యవ్వనమంతా దాచాను మల్లెలలో

నీ కోసం జీవితమంతా వేచాను సందెలలో

మలి సందెలు మల్లెపూలు మనువాడిన వేళలలో

ఆహాహా..హాహాహా..లాలాల లాలలా

ఆహాహా..హాహాహా..లాలాల లాలలా


Share This :



sentiment_satisfied Emoticon