నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం పాట లిరిక్స్ | రాఘవేంద్ర (2003)

 చిత్రం : రాఘవేంద్ర (2003)

సంగీతం : మణిశర్మ 

సాహిత్యం : సుద్దాల అశోక్ తేజ

గానం : హరీష్ రాఘవేంద్ర, సుజాత


నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం

అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా

నువు నా బంధం ఇది ఆనందం

తెలిసి తెలియని నా మనసే

తరుముతున్నది నీకేసే

తడిసి తడియని నీ కురులే

పలుకుతున్నది నా పేరే


నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం


నీవు మాటాడితే ప్రాణం లేచి వస్తుందిరా

పలకకున్నా సరే నీపై మోజు కలిగెలేరా

అందరీ తీరుగా నేను తెలుగు కుర్రాణ్ణిగా

ఎందుకే ఇంతగా పిచ్చి ప్రేమ చాలిక

నీ మగసిరి నడకలలోన

తెలియని మత్తేదో ఉందిరా

అది నన్ను తడిపి ముద్ద చేసే

పగలే కల కంటున్నావో

కలవరింతలో ఉన్నావో

ఊహ నుండి బయటకు రావమ్మో


నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం


నూటికో కోటికో నీలా ఒక్కరుంటారురా

సూటిగా చెప్పనా నీలో కోపం నచ్చేరా

ప్రేమని గుడ్డిది అంటే నమ్మలేదెన్నడూ

నమ్మక తప్పదు నిన్నే చూశా ఇప్పుడు

నీ కంటి బొమ్మల విరుపు

నీచులపై కొరడా చరుపు

అది నీపై వలపే కలిపెరా

పూవంటి హృదయంలోన 

తేనంటిమనసే నీది

నీ ప్రేమకు ఇదిగో జోహారే


నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం

అంతొద్దు లేమ్మా ఈ స్నేహం చాలమ్మా

నువు నా బంధం ఇది ఆనందం

తెలిసి తెలియని నా మనసే

తరుముతున్నది నీకేసే

తడిసి తడియని నీ కురులే

పలుకుతున్నది నా పేరే


నీ స్టైలే నాకిష్టం నీ స్మైలే నా ప్రాణం

నువు నాకోసం ఇక సంతోషం


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)