చిత్రం : ధనమా దైవమా (1973)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : సినారె
గానం : సుశీల
నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...
ఏ సిరులెందుకు?... ఏ నిధులెందుకు?
ఏ సౌఖ్యములెందుకు?... ఆత్మశాంతి లేనిదే..
మనిషి బ్రతుకు నరకమౌను...
మనసు తనది కానిదే...
నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...
చీకటి ముసిరినా?... వేకువ ఆగునా?
ఏ విధి మారినా... దైవం మారునా?
కలిమిలోన లేమిలోన...
పరమాత్ముని తలచుకో...
నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...
జానకి సహనము... రాముని సుగుణము
ఏ యుగమైనను నిలచె ఆదర్శము
వారి దారిలోన నడచువారి జన్మ ధన్యము...
నీ మది చల్లగా... స్వామీ నిదురపో
దేవుని నీడలో... వేదన మరచిపో...
నీ మది చల్లగా...
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon