చిత్రం : శ్రీరామ కథ (1968)
సంగీతం : ఎస్.పి.కోదండపాణి
సాహిత్యం : వీటూరి
గానం : సుశీల, ఘంటాసాల
మాధవా మాధవా మాధవా మాధవా
నను లాలించరా నీ లీలా కేళీ చాలించరా
బాలను నేను తాళగ లేనూ
బాలను నేను తాళగ లేనూ
అలసి మనసే తూలెరా...ఆఅ..ఆ
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
దాగని వలపు దాచగ లేను
వేగమెరా రా దోచుకు పోరా
దాగని వలపు దాచగ లేను
వేగమెరా రా దోచుకు పోరా
కన్నుల పూచే వెన్నెల పూలూ
వాడక మునుపే చేకొనరా
కన్నుల పూచే వెన్నెల పూలూ
వాడక మునుపే చేకొనరా
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ అలుకేలనే
సందిటిలోనా బందీ చేసీ
సందిటిలోనా బందీ చేసీ
సరగున నన్నే ఏలవే...ఏఏఏ
మాధవా మాధవా...ఆఆఅ...ఆఆఆ...
మేఘమాలికల డోలికలూగీ
మేనులు మరిచి విహరించేమా..
మేఘమాలికల డోలికలూగీ
మేనులు మరిచి విహరించేమా..
ఏకాంతముగా పువ్వుల దాగీ
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఏకాంతముగా పువ్వుల దాగీ
విశ్వప్రేమనే వివరించేమా.. ఆఅ..అ
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
బ్రతుకున వరము ఈ పరవశము
కమ్మని కల ఇదే కరిగించకుమా
బ్రతుకున వరము ఈ పరవశము
కమ్మని కల ఇదే కరిగించకుమా
నీవే నేనుగ నేనే నీవుగా
నిఖిలము నిండీ లీనమయేమా..
మాధవా మాధవా నను లాలించరా
నీ లీలా కేళీ తేలించరా...
ఓ చెలీ... ఓ సఖీ.. ఈఈఈఈ
సదా నీ వాడనే అందాలా దేవీ నీ వాడనే
ఓ చెలీ... ఓ సఖీ.. ఆఆఆఆఆ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon