నా జన్మభూమి పాట లిరిక్స్ | సిపాయి చిన్నయ్య (1969)

 చిత్రం :  సిపాయి చిన్నయ్య (1969)

సంగీతం :  ఎం.ఎస్. విశ్వనాథన్

సాహిత్యం :  ఆరుద్ర

గానం :  ఘంటసాల


నా జన్మభూమి..భూమి..భూమి

నా జన్మభూమి..భూమి..భూమి


నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము

నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా


నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము

నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా  


 

నడిచే దారిలో నవ్వే పువ్వులు

శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు

ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా

నడిచేదారిలో నవ్వే పువ్వులు

శాంతి నాదాలతో ఎగిరే పిట్టలు


పచ్చనీ పంటలు...వెచ్చనీ జంటలు

చల్లనీ జీవితం...ఇదే నవభారతం

హాయ్ హాయ్ నా సామి రంగా...

హోయ్ హోయ్ నా సామి రంగా

 

నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము

నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా


బ్రతకాలందరూ దేశం కోసమే

దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే

ఆ హా హా హా ఆ ఆ ఆహా హా హా

బ్రతకాలందరూ దేశం కోసమే

దేశమంటేను మట్టికాదోయ్ మనుషులే


స్వార్థమూ వంచనా లేనిదే పుణ్యము

త్యాగమూ రాగము మిళితమే ధన్యము

హాయ్ హాయ్ నా సామి రంగా...

హోయ్ హోయ్ నా సామి రంగా


నా జన్మభూమి ఎంత అందమైన దేశము

నా ఇల్లు అందులోన కమ్మని ప్రదేశము

నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా

నా సామి రంగా....హాయ్ హాయ్ నా సామి రంగా


Share This :



sentiment_satisfied Emoticon