చిత్రం : కథానాయకుడు (1969)
సంగీతం : టి.వి. రాజు
సాహిత్యం : దాశరథి
గానం : సుశీల
ఆ..ఆ..ఆ..ఆ..ఆ
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ఎనక జన్మల నా నోములన్నీ
ఇప్పుడు పండినవమ్మా..ఆ..ఆ..ఆ..
ఎనక జన్మల నా నోములన్నీ
ఇపుడు పండినవమ్మా
తనకు తానై నా రాజు నాతో
తనకు తానై నా రాజు నాతో
మనసు కలిపేనమ్మా..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
ముద్దు మోమును అద్దాన చూపి
మురిసిపోయాడమ్మా..ఆ..ఆ..
ముద్దు మోమును అద్దాన చూపి
మురిసిపోయాడమ్మా
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా..
మల్లెపూల పల్లకిలోనా
ఒళ్ళు మరిచేనమ్మా..ఆ..ఆ..
ముత్యాల జల్లు కురిసే
రతనాల మెరుపు మెరిసే
వయసు మనసు పరుగులు తీసే.. అమ్మమ్మా..
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon