చిత్రం : జమిందారు గారి అమ్మాయి (1975)
సంగీతం : జి.కె.వెంకటేష్
సాహిత్యం : దాశరథి
గానం : పి.సుశీల
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
అధరాల మీద ఆడిందినామం
అధరాల మీద ఆడిందినామం
కనుపాపలందే కదిలింది రూపం
కనుపాపలందే కదిలింది రూపం
ఆ రూపమే మరీ మరీ నిలిచిందిలే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
సిరిమల్లెపువ్వూ కురిసింది నవ్వూ
నెలరాజు అందం వేసింది బంధం
నెలరాజు అందం వేసింది బంధం
ఆ బంధమే మరీ మరీ ఆనందమే
మ్రోగింది వీణా పదే పదే హృదయాలలోన
ఆ దివ్యరాగం అనురాగమై సాగిందిలే
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon