ఈ మౌనం ఈ బిడియం పాట లిరిక్స్ | డాక్టర్ చక్రవర్తి (1964)

 


చిత్రం : డాక్టర్ చక్రవర్తి (1964)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : ఆరుద్ర

గానం : ఘంటసాల, సుశీల


ఈ మౌనం... ఈ బిడియం...

ఇదేనా ఇదేనా చెలియ కానుకా

ఈ మౌనం... ఈ బిడియం...

ఇదేలే ఇదేలే మగువ కానుకా... 

ఈ మౌనం...

 

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా

ఇన్నినాళ్ళ మన వలపులు వికసించుట ఇందుకా

మమతలన్ని తమకు తామె ...

మమతలన్ని తమకు తామె అల్లుకొనెడి మాలిక... 

ఆ... ఆ...ఆ...ఆఆఆఆ

 

ఈ మౌనం... ఈ బిడియం...

ఇదేనా ఇదేనా చెలియ కానుకా

ఈ మౌనం...


మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక

అహ... ఓహొ... ఆ....

మాటలలో తెలుపలేదు మనసు మూగ కోరిక

కనులు కలిసి అనువదించు ప్రణయ భావగీతిక... 

ఆ...ఆ... ఆ...ఆఆఆఆఆ

 

ఈ మౌనం... ఈ బిడియం...

ఇదేలే ఇదేలే మగువ కానుక... 

ఈ మౌనం

 

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక

ఏకాంతము దొరికినంత ఎడమోమా నీవేడుక

ఎంత ఎంత ఎడమైతే...

ఎంత ఎంత ఎడమైతే అంత తీపి కలయిక... 

ఆ...ఆ... ఆ...ఆఆఆఆఆ


ఈ మౌనం... ఒహో ఈ బిడియం... ఊహూ 

ఇదేనా ఇదేనా చెలియ కానుకా 

ఈ మౌనం... ఒహో ఈ బిడియం... ఊహూ 

ఇదేలే ఇదేలే మగువ కానుకా... ఈ మౌనం

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)