మేఘాలే తాకింది హాయి హైలెస్స పాట లిరిక్స్ | ప్రేమించుకుందాం.. రా (1997)

 చిత్రం : ప్రేమించుకుందాం.. రా (1997)

సంగీతం : మహేష్

సాహిత్యం : సిరివెన్నెల

గానం : బాలు, చిత్ర


మేఘాలే తాకింది హాయి హైలెస్స

నవరాగంలో నవ్వింది నా మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిష

చేలరేగాలి రమ్మంది హల్లో అంటూ..

ఒళ్ళోవాలే అందాల అప్సరస


మేఘాలే తాకింది హాయి హైలెస్స

నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా

ఈ గాలి రేపింది నాలో నిష

అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ..

అల్లేసింది నీ మీద నా ఆశ


ఆ..ఆ..ఆ..


తొలిసారి నిను చూసి మనసాగక

పిలిచానే చిలకమ్మ మెల మెల్లగ

తెలుగంత తీయంగ... నువ్వు పలికావే స్నేహంగా

చెలిమన్న వలవేసి నను లాగగా

చేరాను నీ నీడ చల చల్లగా

గిలిగింత కలిగేలా... తొలి వలపంటే తేలిసేలా

హా.. కునుకన్న మాటే నను చేరక

తిరిగాను తేలుసా ఏం తోచక

 


 

మేఘాలే తాకింది హాయి హైలెస్స

నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 


ఆ..ఆ..ఆ..

తొలి పొద్దు వెలుగంత చిరువేడిగా

నిలువెల్ల పులకింత చిగురించగా

దిగులేదో హాయేదో.. గుర్తు చెరిపింది ఈ వింత

ఒక మత్తు కలిగింది గమ్మత్తుగా

నిజం ఏదో కల ఏదో మరిపించగా

పగలేదో రేయేదో... రెండు కలిశాయి నీ చెంత 

ప్రేమంటే ఇంతే ఏమో మరి

దానంతు ఏదో చూస్తే సరి


మేఘాలే తాకింది హాయి హైలెస్స

నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా 

ఈ గాలి రేపింది నాలో నిష

అది నా శ్వాసలో చేరి హల్లో అంటూ...

అల్లేసింది నీ మీద నా ఆశ..


 

మేఘాలే తాకింది హాయి హైలెస్స

నవరాగంలో నవ్వింది నీ మోనాలిసా


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)