మనవే వినవా మనసే కనవా పాట లిరిక్స్ | గోపాల్రావుగారి అమ్మాయి (1980)

 చిత్రం : గోపాల్రావుగారి అమ్మాయి (1980)

సంగీతం : చక్రవర్తి

సాహిత్యం : వేటూరి

గానం : మాధవపెద్ది రమేష్, సుశీల


మనవే వినవా మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా

కలలే మరిచి కనులే తెరిచి

నిజమేదో స్వామీ గుర్తించవా

ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..


మనవే విననా మనసే కననా

మది లోపలి మాటను మన్నించనా

గతమే మరచి కనులే తెరచి

నిజమైతే స్వామీ గుర్తించనా

ఇక ఒంటరి తనమే వదిలించనా..


మనవే వినవా మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా


నిను చూడగనే నే బెంగపడి

సంపెంగలలో అది దాచుకుని

చిరునవ్వులకే మది జివ్వుమని

కసి చూపులతో కబురంపుకొని

పరుగులు తీసే పరువంతో

పైటలు జారే అందంతో

చక్కలిగిలిగా సరసాలాడే

చలి చలిగా సరిగమ పాడే

వలపులు పిలిచే ఈ వేళలో

వయసులు తెలిసే ఈ వేళలో


మనవే వినవా మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా

గతమే మరచి కనులే తెరచి

నిజమైతే స్వామీ గుర్తించనా

ఇక ఒంటరి తనమే ఒదిలించనా..


తొలిచూపులనే మునిమాపులుగా 

మరుమల్లెల జల్లులు జల్లుకుని 

బిగి కౌగిలినే నా లోగిలిగా 

అరముద్దుల ముగ్గులు పెట్టుకుని 

కలలైపోయిన కన్నులతో 

వలలైపోయిన చూపులతో 

ప్రేమే ముదిరీ పెళ్ళైపోయీ 

పెళ్ళే కుదిరీ ఇల్లైపోయే 

మనసులు కలిసే ఈ వేళలో 

మమతలు విరిసే ఈ వేళలో


మనవే విననా మనసే కననా

మది లోపలి మాటను మన్నించనా

గతమే మరచి కనులే తెరచి

నిజమైతే స్వామీ గుర్తించనా

ఇక వంటరి తనమే వదిలించనా..


మనవే వినవా మనసే కనవా

మది లోపలి మాటను మన్నించవా

కలలే మరిచి కనులే తెరిచి

నిజమేదో స్వామీ గుర్తించవా

ఇక ఒంటిగ నన్నూ వదిలెయ్యవా..


Share This :



sentiment_satisfied Emoticon