మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు పాట లిరిక్స్ | రాక్షసుడు (1991)

 చిత్రం : రాక్షసుడు (1991)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, జానకి


మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు..

మల్లె జాజి అల్లుకున్న రోజు..

జాబిలంటీ ఈ చిన్నదాన్ని..

చూడకుంటే నాకు వెన్నెలేది..


ఏదో అడగాలనీ.. 

ఎంతో చెప్పాలనీ..

రగిలే ఆరాటంలో..

వెళ్ళలేను.. ఉండలేను.. ఏమి కాను...

మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

మల్లె జాజి అల్లుకున్న రోజు


చేరువైనా రాయబారాలే

చెప్పబోతే మాట మౌనం

దూరమైన ప్రేమధ్యానాలే

పాడలేని భావగీతం

ఎండల్లో.. వెన్నెల్లో.. ఏంచేతో..

ఒక్కరం ఇద్దరం అవుతున్నా

వసంతాలు ఎన్నొస్తున్నా

కోకిలమ్మ కబురేది

గున్నమావి విరబూస్తున్నా

తోటమాలి జాడేది

నా ఎదే తుమ్మెదై సన్నిదే చేరగా...


మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

మల్లె జాజి అల్లుకున్న రోజు


కళ్ళనిండా నీలిస్వప్నాలే..

మోయలేని వింత మోహం

దేహమున్న లేవు ప్రాణాలే..

నీవు కాదా నాకు ప్రాణం

సందింట్లో ఈ మొగ్గే పూయనీ

రాగాలే బుగ్గల్లో దాయనీ

గులాబీలు పూయిస్తున్నా

తేనేటీగ అతిధేడి

సందెమబ్బులెన్నొస్తున్నా

స్వాతి చినుకు తడుపేది

రేవులో నావలా నీ జతే కోరదా


జాబిలంటి ఈ చిన్నదాన్ని

చూడకుంటే నీకు వెన్నెలేది

ఏదో అడగాలనీ

ఎంతో చెప్పాలనీ

రగిలే ఆరాటంలో..

వెళ్ళలేను.. ఉహ్మ్..

ఉండలేను.. ఉహ్మ్...

ఏమి కాను... హా..


మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు

మల్లె జాజి అల్లుకున్న రోజు

లలలల.. లలలలలాలా

ఉహ్మ్.. ఉహ్మ్.. హహహహా..


Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)