చిత్రం : ఓ సీత కథ (1974)
సంగీతం : కె.వి.మహదేవన్
సాహిత్యం : సినారె
గానం : బాలు, సుశీల
మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
వెన్నెలంత చల్లన మా సీత సొగసు
ఏది ఏది ఏది
తేనె కన్న తీయన మా బావ మనసు
తెలుగంత కమ్మన మా బావ మనసు
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి..
నన్ను పిలిచి అత్తమ్మ అడగాలి..
ఏమని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
కన్నె సీత కలలన్నీ పండేది ఎపుడని
నీతోనే ఒక మాట..
నీతోనే ఒక మాట చెప్పాలి..
ఏమని
నీ తోడే లేకుంటే ఈ సీతే లేదని
మల్లెకన్న తెల్లన మా సీత సొగసు
తేనె కన్న తీయన మా బావ మనసు
మనసుంది ఎందుకని
మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని
ఆ గుడిలో దివ్వెగా నిలవాలని
ఆఆఅ.. మనసుంది ఎందుకని
మమతకు గుడిగా మారాలని
వలపుంది ఎందుకని
ఆ గుడిలో దివ్వెగా నిలవాలని
ఆఆఅ మనువుంది ఎందుకని
ఆ దివ్వెకు వెలుగై పోవాలని
బ్రతుకుంది ఎందుకని
ఆ వెలుగే నీవుగా చూడాలని
ఆ వెలుగే నీవుగా చూడాలని
మల్లెకన్న తెల్లన.. మ్.మ్.హుహు
తేనె కన్న తీయన... మ్మ్..మ్.హుహు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon