మనమోహనా నవ మదనా పాట లిరిక్స్ | దొంగల్లో దొర (1957)

 చిత్రం : దొంగల్లో దొర (1957)

సంగీతం : సుబ్రహ్మణ్యరాజు ఎమ్.

సాహిత్యం : మల్లాది

గానం : పి.లీల


మాధవా..ఆఅ..ఆ మానిని చిత్త చోరా

గోకులానంద బాలా నన్నేలరా..


మనమోహనా నవ మదనా

మనమోహనా నవ మదనా

మనసీయరా నీదానా

మనసీయరా నీదానా

మనమోహనా నవ మదనా

మనసీయరా నీదానా

మనమోహనా..


చనువైన స్వామీ దరిచేర రావేరా

చనువైనా స్వామీ..

చనువైన స్వామీ దరిచేర రావేరా

నెనరైన నా మనసూ..

నెనరైన నా మనసూ నీదే...


మనమోహనా నవ మదనా

మనసీయరా నీదానా

మనమోహనా..


బృందావన వీధుల సరసాలతో

మురిపించు మనోహర

వేగమునేలగరా.. నీ సరి జాణనురా..

నిన్నిక విడువనురా..


మనమోహనా నవ మదనా

మనమోహనా..

 

మైమరపించు జాణనురా

సయ్యాటాకాడ సరసాలా తేలేమురా

మధురానంద గీతిని నేనేరా

మురళీలోల జాగేలరా.. సయ్యాటలాడ

మనసైన లలననురా

నను పాలించ పరువౌనురా స్వామి

ఈ రేయి మనదౌనురా..

నను పాలించ పరువౌనురా స్వామి

ఈ రేయి మనదౌనురా..

తొలిప్రాయంబు దోచిన దొరవవురా..


మైమరపించు జాణనురా

సయ్యాటాకాడ సరసాలా తేలేమురా


మైమరపించు జాణనురా

సయ్యాటాకాడ సరసాలా తేలేమురా 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)