మావి చిగురు తినగానే పాట లిరిక్స్ | సీతామాలక్ష్మి (1978)

 చిత్రం : సీతామాలక్ష్మి (1978)

సంగీతం : కే. వి. మహదేవన్

సాహిత్యం : దేవులపల్లి కృష్ణశాస్త్రి

గానం : బాలు, సుశీల


మావి చిగురు తినగానే కోవిల పలికేనా

మావి చిగురు తినగానే కోయిల పలికేనా

కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా

కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా

ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని


మావి చిగురు తినగానే కోవిల పలికేనా

కోవిల పలికేనా


తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా

తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా

తారాటలా సయ్యాటలా

సయ్యాటలా తారాటలా

వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు

వన్నెలే కాదు వగలే కాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు

బింకాలు బిడియాలు పొంకాలు పోడములు

ఏమో ఎవ్వరిదో గాని ఈ విరి గడసరి


మావి చిగురు తినగానే కోవిల పలికేనా

కోవిల పలికేనా


ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల

ఊయ్యాలా జంపాల జంపాల ఊయ్యాల

ఒకరి ఒళ్ళు ఊయ్యాలా వేరొకరి గుండె జంపాల

ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో

ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో

పలకరింతలో పులకరింతలో

పలకరింతలో పులకరింతలో

ఏమో ఏమగునో గాని ఈ కథ మన కథ


మావి చిగురు తినగానే కోవిల పలికేనా

కోవిల గొంతు వినగానే మావి చిగురు తొడిగేనా

ఏమో ఏమనునో గాని ఆమని ఈ వని


మావి చిగురు తినగానే కోయిల పలికేనా ఆఆఆ..

కోయిల పలికేనా

Share This :



sentiment_satisfied Emoticon