లలిత కళారాధనలో పాట లిరిక్స్ | కళ్యాణి (1979)

 చిత్రం : కళ్యాణి (1979)

సంగీతం : రమేశ్ నాయుడు

సాహిత్యం : వేటూరి

గానం : బాలు


లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ

లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ..ఊఊ

మధురభారతి పద సన్నిధిలో..ఓ..ఓ..

మధురభారతి పద సన్నిధిలో

ఒదిగే తొలిపువ్వును నేను ఊ..ఊ..

ఒదిగే తొలిపువ్వును..నేను..ఊ..

 

లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ

 

ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ

ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ

ఏ..ఫలమాశించి.. మత్తకోకిలా..ఆ

ఎలుగెత్తి పాడునూ..ఊ..ఊ..ఊ


ఏ వెల ఆశించి పూచే పువ్వూ..

తావిని విరజిమ్మునూ..ఊ..ఊ..ఊ

ఏ వెల ఆశించి పూచే పువ్వూ..

తావిని విరజిమ్మునూ..ఊ..ఊ..ఊ

అవధిలేని ప్రతి అనుభూతికి..ఈ..ఈ..

అవధిలేని ప్రతి అనుభూతికి

ఆత్మానందమే..ఏ..ఏ..పరమార్థం


లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ

 

ఏ సిరి కోరి పోతన్నా..ఆ..

భాగవత సుధలు చిలికించెనూ..ఊ..ఊ..ఊ

ఏ సిరి కోరి పోతన్నా..ఆ..

భాగవత సుధలు చిలికించెనూ..ఊ..ఊ..ఊ

ఏ..నిధి కోరి త్యాగయ్యా..

రాగజల నిధులు పొంగించెనూ..ఊ..ఊ..ఊ

ఏ..నిధి కోరి త్యాగయ్యా..

రాగజల నిధులు పొంగించెనూ..ఊ..ఊ..ఊ

రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ

రమణీయ కళా..ఆ..విష్కృతికి..ఈ..ఈ

రసా..ఆ..నందమే పరమార్థం.


లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ..ఊఊ

మధురభారతి పదసన్నిధిలో..ఓ..ఓ..

మధురభారతి పదసన్నిధిలో

ఒదిగే తొలిపువ్వును నేను ఊ..ఊ..

ఒదిగే తొలిపువ్వును..ఊ..నేను

లలిత కళారాధనలో.. వెలిగే

చిరు దివ్వెను నేను..ఊ..ఊ

Share This :
avatar

Written by C Narayan reddy not Veturi

delete 13 March 2023 at 01:31



sentiment_satisfied Emoticon