లాలీ శ్రీకృష్ణయ్య పాట లిరిక్స్ | లాలి పాటలు

లాలీ శ్రీకృష్ణయ్య నవ నీల మేఘవర్ణ

బాలగోపాలకృష్ణ పవ్వళించవేమయ్య


శృంగారముగ నిన్ను బంగారు తొట్టెలలో

రంగూగ జోలపాడెదాను నిదురపోవయ్యా


ఇందరిలోపల నీకు ఎవరు కావలెనయ్య

ఇందీరాక్షి కాళిందియే కావలెనా


లలితాంగీ రుక్మిణీ లలనయే కావలెనా

పలుకు కోకిల సత్యభామయే కావలెనా

లాలీ శ్రీకృష్ణయ్య నీలమేఘవర్ణ

బాలగోపాల కృష్ణ పవ్వళించవేమయ్య

Share This :



sentiment_satisfied Emoticon