కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు పాట లిరిక్స్ | అందమైన అనుభవం (1979)

 చిత్రం : అందమైన అనుభవం (1979)

సంగీతం : ఎం.ఎస్. విశ్వనాథన్

సాహిత్యం : ఆచార్య ఆత్రేయ

గానం : బాలు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు

కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు

వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు

చెలిమికెపుడూ జతగాళ్ళు చెడుపుకెపుడు పగవాళ్ళు

వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు

తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు

విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు

తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు

నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు

మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు

దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు

తెంచేసెయ్ పాతసంకెళ్ళు

మనుషులె మన నేస్తాలు కమాన్ క్లాప్.. మనసులె మన కోవెళ్ళు

మనుషులె మన నేస్తాలు మనసులె మన కోవెళ్ళు..యెవ్రీబడీ

మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు

ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు

హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..

కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు

కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు ..

కమాన్ యెవ్రీబడీ జాయిన్ టుగెదర్..

Share This :

sentiment_satisfied Emoticon