కిలకిల నవ్వులు చిలికిన పాట లిరిక్స్ | చదువుకున్న అమ్మాయిలు (1963)

 చిత్రం : చదువుకున్న అమ్మాయిలు (1963)

సంగీతం : ఎస్. రాజేశ్వరరావు

సాహిత్యం : దాశరథి

గానం : ఘంటసాల, సుశీల


కిలకిల నవ్వులు చిలికిన

పలుకును నాలో బంగారువీణ

కరగిన కలలే నిలిచిన

విరిసెను నాలో మందారమాల


రమ్మని మురళీరవమ్ములు పిలిచె

రమ్మని మురళీరవమ్ములు పిలిచె

అణువణువున బృందావని తోచె

తళతళలాడే తరగలపైన

అందీ అందని అందాలు మెరిసె


కిలకిల నవ్వులు చిలికిన

పలుకును నాలో బంగారువీణ


నీవున్న వేరే సింగారములేల

నీవున్న వేరే సింగారములేల

నీ పాదధూళి సింధూరము కాదా

మమతలు దూసి మాలలు చేసి

గళమున నిలిపిన కళ్యాణి నీవే


కరగిన కలలే నిలిచిన

విరిసెను నాలో మందారమాల


నీ కురులే నన్ను సోకిన వేళ

నీ కురులే నన్ను సోకిన వేళ

హాయిగ రగిలేను తీయని జ్వాల

గలగల పారే వలపులలోనే

సాగెను జీవనరాగాల నావ


కిలకిల నవ్వులు చిలికిన

పలుకును నాలో బంగారువీణ

కిలకిల నవ్వులు చిలికినా


Share This :



sentiment_satisfied Emoticon