కీరవాణీ చిలకల కొలికిరో పాడవేమే పాట లిరిక్స్ | అన్వేషణ (1985)

 చిత్రం : అన్వేషణ (1985)

సంగీతం : ఇళయ రాజా

సాహిత్యం : వేటూరి

గానం : ఎస్. పి బాలు, ఎస్. జానకి


సా ని స రి సాని ఆ హ ఆ

సా ని స మ గా మరి ఆ

ప ద సా ని స రి సాని ఆ హ ఆ

సా ని సమ గా మరి ఆ అ

ప ద సస ని రిరి స గగ గరి మమ గగ మా

సా ని ద ప మ గ రి స ని


కీరవాణీ చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా

విరబుసిన ఆశలు విరితేనెలు చల్లగా

అలరులు కురిసిన రుతువుల తడిసిన

మధురస వాణి… కీరవాణీ

చిలకల కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా


గ రి స ప మ గ ప ని

స రి గ రి గ స.. నిస

ఈ పూలలో అందమై ఈ గాలిలో గంధమై

నా తోటలో చైత్రమై ఈ బాటనే నడచిరా

నీ గగనాలలో నే చిరు తారనై

నీ అధరాలలో నే చిరునవ్వునై

స్వరమే లయగా ముగిసే

సలలిత కలరుత స్వరనుత గతియుత గమకము తెలియకనే

 

కీరవాణి చిలకల కల కల పాడలేదు వలపులే తెలుపగా

ఇల రాలిన పువ్వులు వెదజల్లిన తావుల

అలికిడి ఎరుగని పిలుపులా అలిగిన మంజులవాణి కీరవాణీ

చిలకల కల కల పాడలేదు వలపులే తెలుపగా


నీ కన్నులా నీలమై నీ నవ్వులా వెన్నెలై

సంపెంగలా గాలినై తారాడనా నీడనై

నీ కవనాలలో నే తొలి ప్రాసనై

నీ జవనాలలో జాజుల వాసనై

యెదలో ఎదలే కదిలే

పడుచుల మనసులు పంజర సుఖముల పలుకులు తెలియకనే

 

కీరవాణీ చిలకలా కలకలా పాడలేదు వలపులే తెలుపగ 

విరబూసిన ఆశలు విరితేనెలు చల్లగా 

అలరులు కురిసిన రుతువుల తడిసిన మధురసవాణి కీరవాణీ

చిలకలా కొలికిరో పాడవేమే వలపులే తెలుపగా

Share This :



sentiment_satisfied Emoticon