చిత్రం : ఆనందం (2001)
సంగీతం : దేవిశ్రీ ప్రసాద్
సాహిత్యం : సిరివెన్నెల
గానం : మల్లికార్జున్, సుమంగళి
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
పెదవుల్లో ఈ దరహాసం నీకోసం పూసింది
నీ జతలో ఈ సంతోషం పంచాలనిపిస్తోంది
ఎందుకనో మది నీకోసం ఆరాటం పడుతోంది
అయితేనేం ఆ అలజడిలో ఒక ఆనందం ఉంది
దూరం మహ చెడ్డదని ఈ లోకం అనుకుంటుంది
కాని ఆ దూరమే నిన్ను దగ్గర చేసింది
నీలో నా ప్రాణం ఉందని ఇపుడేగా తెలిసింది
నీతో అది చెప్పిందా నీ జ్ఞాపకాలే నా ఊపిరైనవని
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ప్రతి నిమిషం నా తలపంతా నీ చుట్టూ తిరిగింది
ఎవరైనా కనిపెడతారని కంగారుగ ఉంటోంది
నా హృదయం నీ ఊహలతో తెగ ఉరకలు వేస్తోంది
నాక్కూడా ఈ కలవరమిపుడే పరిచయమయ్యింది
అద్దంలో నా బదులు అరె నువ్వే కనిపించావే
నేనే ఇక లేనట్టు నీలో కరిగించావే
ప్రేమా ఈ కొత్త స్వరం అని అనుమానం కలిగింది
నువ్వే నా సందేహానికి వెచ్చనైన రుజువియ్యమంది మది
కనులు తెరిచినా కనులు మూసినా కలలు ఆగవేలా
నిజము తెలిసినా కలని చెప్పినా మనసు నమ్మదేలా
ఎదుటే ఎపుడు తిరిగే వెలుగా ఇదిగో ఇపుడే చూశా సరిగా
ఇన్నాళ్ళు నేనున్నది నడి రేయి నిదురలోనా
ఐతే నాకీనాడే తొలిపొద్దు జాడ తెలిసింద కొత్తగా
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon