కాదు సుమా కల కాదు సుమా పాట లిరిక్స్ | కీలుగుఱ్ఱం (1949)

 చిత్రం : కీలుగుఱ్ఱం (1949)

సాహిత్యం : తాపీ ధర్మారావు నాయుడు

సంగీతం : ఘంటసాల

గానం : ఘంటసాల, వక్కలంక సరళ


కాదు సుమా కల కాదు సుమా

కాదు సుమా కల కాదు సుమా

అమృత పానమును అమర గానమును

అమృత పానమును అమర గానమును

గగన యానమును కల్గినట్లుగా

గాలిని తేలుచూ సోలిపోవుటిది

కాదు సుమా కల కాదు సుమా

 

ప్రేమలు పూచే సీమల లోపల

ప్రేమలు పూచే సీమల లోపల

వలపులు పారే సెలయేరులలో

తే టి పాటలను తేలియాడితిని


కాదు సుమా కల కాదు సుమా


కన్నె తారకల కలగానముతో

కన్నె తారకల కలగానముతో

వెన్నెల చేరుల ఉయ్యాలలో

ఓ... ఓ... ఓహో... ఓ... ఓ... ఒహో...

వెన్నెల చేరుల ఉయ్యాలలో

ఉత్సాహముతో ఊగుచుండుటిది


కాదు సుమా కల కాదు సుమా

 

పూల వాసనల గాలి తెరలలో

వలపు చీకటుల వన్నె కాంతిలో

పూల వాసనల గాలి తెరలలో

వలపు చీకటుల వన్నె కాంతిలో

ఆహా... ఆ... ఆ... ఆహా... ఆ... ఆ...

దోబూచులాడుటిది


కాదు సుమా కల కాదు సుమా

కాదు సుమా కల కాదు సుమా

Share This :



sentiment_satisfied Emoticon