కాలమైన దైవమైన ఓడిపోవు పాట లిరిక్స్ | డాన్స్ మాస్టర్ (1989)

 చిత్రం : డాన్స్ మాస్టర్ (1989)

సంగీతం : ఇళయరాజా

సాహిత్యం : వేటూరి

గానం : బాలు, చిత్ర


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం

నిప్పులాంటి ఆశయం నీరుకాని నిశ్చయం  

ఆడకూ అగ్నితో హే బహుపరాక్ పో..

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

 

వీచే గాలీ నీ సొంతం కాదు

తనకంతం లేదు అది ఆపేదెవరూ 

మాలో ప్రేమకూ ఎదురే లేదు

ఏ బెదురూ లేదు ఇక నిదరే రాదు

మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా

మొగ్గలై రాలిపోవాలా పువ్వులై నవ్వుకోవాలా  

ఆహా పూవంటి నీ ఒంటికే తావినై

మదిలో మధువై మనసే తనువై నేడు

 


 

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం  


పేచీ కొస్తేను పూచీ మాదా 

తెగ వాచీ పోదా మారీచా నీచా.. 

రాజీ కొచ్చేయి మాజీ యోధా

మాతాజీ నాధ మరియాదే లేదా 

ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ

ఆయుధాలేవీ లేకున్నా అత్మవిశ్వాసం మాతోడూ

ప్రేమ తుప్పంటనీ చండ్రనిప్పంటిదీ  

వలపు గెలుపు చివరకు మావే లేవోయ్


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం

నిప్పులాంటి హా ఆశయం హా 

నీరుకాని హా నిశ్చయం హా

ఆడకూ అగ్నితో హే బహుపరాక్ పో..

కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం


కాలమైన దైవమైన ఓడిపోవు ప్రేమకంకితం

త్యాగరాజ కీర్తనల్లె రాగమల్లుకున్న జీవితం 

Share This :



sentiment_satisfied Emoticon