చిత్రం : శ్రీమంతుడు (2015)
సంగీతం : దేవీశ్రీప్రసాద్
సాహిత్యం : రామజోగయ్య శాస్త్రి
గానం : సాగర్, సుచిత్ర
జత కలిసే జత కలిసే జగములు రెండు జతకలిసే
జత కలిసే జత కలిసే అడుగులు రెండు జతకలిసే
జనమోక తీరు వీళ్ళోక తీరు ఇద్దరొకలాంటి వారు
అచ్చు గుద్దినట్టు ఒక కలగంటూ ఉన్నారిద్దరు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒక్కరినీ ఇంకొకరూ
నలుపు జాడ నలుసైనా అంటుకోని హృదయాలు
తలపు లోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు
మాటలాడుకోకున్న మది తెలుపుకున్న భావాలు
ఒకరికొకరు ఎదురుంటే చాలులే నాట్యమాడు ప్రాయాలు
పేరుకేమో వేరు వేరు బొమ్మలేమరీ
ఇరువురికి గుండెలోని ప్రాణమొక్కటే కదా
బహుశా బ్రహ్మ పొరపాటుఏమో ఒక్కరే ఇద్దరు అయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్న రానందంగా ఒకరిని ఇంకొకరు
ఉన్నచోటు వదిలేసి ఎగిరిపోయెనీలోకం
ఏకమైన ఈ జంట కొరకు ఏకాంతమివ్వటం కోసం
నీలి రంగు తెర తీసి తొంగి చూసే ఆకాశం
చూడకుండా ఈ అద్బుతాన్ని అసలుండలేదు ఒక నిమిషం
నిన్నదాక ఇందుకేమో వేచి ఉన్నది
ఎడతెగని సంబరాన తేలినారు నేడిలా
ఇప్పుడే కలిసి అప్పుడే వీరు ఎప్పుడో కలిసిన వారయ్యారు
ఏ కన్ను ఎపుడు చదవని పుస్తకమై వీరు
చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరూ
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon