చిత్రం : యుద్దభూమి (1988)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : వేటూరి
గానం : బాలు, జానకి
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
పడమటింట పొద్దు వాలి గడియ పెట్టినా
తారకల్లు ఆకసాన దీపమెట్టినా
వాగులమ్మ అలల నీటి వీణ మీటినా
వెన్నెలమ్మ కనుల మీద వేణువూదినా
ఆగదు అందదు మనసు ఎందుకో
ఒడినే అడిగే ఒంటి మీద వలపు సోకి
కంటి మీద కునుకురాని కొంటె కోరిక
తెలుసుకో ఇక....!
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
కోకిలమ్మ కొత్త పాట కోసుకొచ్చినా
పూవులమ్మ కొత్త హాయి పూసి వెళ్ళినా
వానమబ్బు మెరుపులెన్ని మోసుకొచ్చినా
మాఘవేళ మత్తు జల్లి మంత్రమేసినా
తీరని తీయని మనసు ఏమిటో
అడుగు చెబుతా ఒంటిగుంటె ఓపలేక
జంట కట్టుకున్న వేళ చిలిపి కోరిక
తెలుపుకో ఇక...
సోలి సోలి లేత ఈడు సొమ్మసిల్లినా
చూసి చూసి రెండు కళ్ళు చెమ్మగిల్లినా
ఎందుకో నిలువనీదు నా మనసు బహుశా..
బహుశా.. విరహంలో వుందేమో ఆ సొగసు
జాలి జాలి సందెగాలి లాలిపాడినా
తేలి తేలి మల్లెపూల తెమ్మెరాడినా
ఎందుకో నిదరపోదు నా వయసు బహుశా..
బహుశా.. ప్రేమించిందో ఏమో నా మనసు
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon