ఇంతకంటె వేరే అందగత్తెలు పాట లిరిక్స్ | ఊహలు గుసగుసలాడే (2014)

 చిత్రం : ఊహలు గుసగుసలాడే (2014)

సంగీతం : కళ్యాణి కోడూరి

సాహిత్యం : సిరివెన్నెల

గానం : హేమచంద్ర


ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకోమరి

ఎందరెదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి

ఎందుకంటె ఏమో ఎందుకూ అని

తెలియక తికమక పడుతున్నది మది


ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకోమరి

ఎందరేదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి


కోపగించి బుంగమూతి పెట్టినా

నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా

మహాద్భుతం అనేట్టుగానే ఉంది అనుకున్నా

ఇదేదో పిచ్చి కదా మరీ అనెవ్వరైన అంటె

నిజమేనని ఒప్పేసుకుంట

అంతేగాని తన వెనకనే పడిన మనసునీ

ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా

ఆ పిచ్చే బాగుందని మరింత పెంచుకుని 

ఇలాగే ఉంటానంతే తప్పైనా ఒప్పైనా గాని.. 


ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకోమరి

ఎందరేదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి


కత్రినా కరీనా అంటు కొంతమంది

కోసమే కుర్రాళ్ళు అంత కొట్టుకుంటె

లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో

నా కళ్ళతోటి చూస్తే సరీ తనను మించి

మరొకరు లేరనీ అంటారు కద

ఎవ్వరైన అలా అన్నారని ఊరంతా వచ్చి

తనని నా కళ్ళతోటి చూస్తనంటే చూడగలనా

నువ్వు నాకే సొంతమనీ తనకే చెప్పాలనీ 

అనుకోడమె కానీ పైకేమో అనలేకపోతున్న


ఇంతకంటె వేరే అందగత్తెలు

కనబడలేదని అనననుకోమరి

ఎందరెదురైనా సుందరాంగులు

తడబడి ఎరుగదు మనసీ మాదిరి

యాహూ..ఊఊఊ...హూ...హూ... 

యాహూహూ...హూహూ....

యాహూ..ఊఊఊ...హూ...హూ... 

యాహూహూ...హూహూ.... 

Share This :



sentiment_satisfied Emoticon