చిత్రం : ఏడంతస్థుల మేడ (1980)
సంగీతం : చక్రవర్తి
సాహిత్యం : రాజశ్రీ
గానం : బాలు, సుశీల
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
ఆఆ..ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
హరివిల్లు విరిసింది తొలిప్రేమలో
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
ఆహ హ హా ఆ ఆ ఆ
ఆహ హ హా ఆ ఆ ఆ
వెల్లువలా పొంగే నా పాల వయసు
పల్లవి పాడెను నా మూగ మనసు
వెల్లువలా పొంగే నా పాల వయసు
ఆ ఆ ఆ పల్లవి పాడెను నా మూగ మనసు
నీ పాట నా పాట కావాలని
ఆ నింగి ఈ నేల కావాలని
చినుకులు వేశాయి ఒక వంతెన
చినుకులు వేశాయి ఒక వంతెన
కలిసిన హృదయాలకది దీవెన
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
తడిసిన తనువేదో కోరింది స్నేహం
కలిగెను జడివానలో నాకు దాహం
తడిసిన తనువేదో కోరింది స్నేహం
ఆఆ కలిగెను జడివానలో నాకు దాహం
నీ చెంతలో నేను మరవాలనీ
నీ కంటిలో పాప కావాలని
వలపులు చేసాయి వాగ్దానము
హాఅ.. వలపులు చేసాయి వాగ్దానము
మనకివి సిరులింక కలకాలము
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
చిరుజల్లు కురిసింది వినువీధిలో
హరివిల్లు విరిసింది తొలిప్రేమలో
ఇది మేఘసందేశమో.. అనురాగ సంకేతమో
comment 0 comments:
more_vertsentiment_satisfied Emoticon