ఇది ఆమని సాగే చైత్రరథం పాట లిరిక్స్ | జేగంటలు (1981)

 


చిత్రం : జేగంటలు (1981)

సంగీతం : కె.వి. మహదేవన్

సాహిత్యం : వేటూరి

గానం: బాలు, సుశీల


ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం

మనోవేగమున మరోలోకమున

పరుగులు తీసే మనోరథం 


ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం

మనోవేగమున మరోలోకమున

పరుగులు తీసే మనోరథం

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం


పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 

ప్రణయాన పంచమస్వరమాలపించాలి

పంచప్రాణాల వేణువూది కోయిల పాడాలి.. 

ప్రణయాన పంచమస్వరమాలపించాలి

కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 

నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి

కృష్ణ వేణమ్మ యమునల్లె దారి చూపాలి.. 

నా కృష్ణుడున్న తీరాలు చేరుకోవాలి

నీరెండ పూలుపెట్టి 

నీలాల కోక చుట్టీ 

నువ్వొస్తే బృందావనాలు నవ్వాలి


ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం

మనోవేగమున మరోలోకమున 

పరుగులు తీసే మనోరథం

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం


అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి

మనవంక తారలింక తేరిచూడాలి 

అల నెలవంక పల్లకీలో సాగిపోవాలి

మనవంక తారలింక తేరిచూడాలి

కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 

నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి

కొసమెరుపుల్ల ముత్యాల హారమేయాలీ 

నా వలపల్లే నిను నేను అల్లుకోవాలి

నా గుండె ఝల్లుమంటే 

గుడిగంట ఘల్లు మంటే

కౌగిళ్ళలో ఇళ్ళు కట్టుకోవాలి.. 


ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

ఇది రుక్మిణి ఎక్కిన పూలరథం పూలరథం

మనోవేగమున మరోలోకమున 

పరుగులు తీసే మనోరథం

ఇది ఆమని సాగే చైత్రరథం చైత్రరథం

Share This :



sentiment_satisfied Emoticon