గోపికమ్మా చాలును లేమ్మా పాట లిరిక్స్ | ముకుంద (2014)

 చిత్రం : ముకుంద (2014)

సంగీతం : మిక్కీ జె. మేయర్ 

సాహిత్యం : సిరివెన్నెల 

గానం : చిత్ర, కోరస్


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా 


విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా 

తలపును లేపాలిగా బాలా.. 

పరదాలే తీయకా పరుపే దిగనీయకా 

పవళింపా ఇంతగా మేలా..

కడవల్లో కవ్వాలు సడిచేస్తున్నా వినకా 

గడపల్లో కిరణాలు లేలెమ్మన్నా కదలక 

కలికీ ఈ కునుకేల తెల్లవార వచ్చెనమ్మ 


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా


నీ కలలన్నీ కల్లలై రాతిరిలో కరగవనీ 

నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి 

నీకోసమనీ గగనమే భువిపైకి దిగివచ్చెననీ 

ఆ రూపాన్నీ చూపుతో అల్లుకుపో సౌదామినీ 

జంకేలా జాగేలా సంకోచాలా జవ్వనీ 

బింకాలూ బిడియాలూ ఆ నల్లనయ్య చేత చిక్కి 

పిల్లన గ్రోవై ప్రియమారా నవరాగాలే పాడనీ..

అంటూ ఈ చిరుగాలి నిను మేలుకొలుపు సంబరాన


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా


ఆఆ..ఆఆఅ..ఆఆఆ.ఆఆఆఆఅ...ఆఆ.ఆఆఆఆఆ....

ఏడే అల్లరి వనమాలీ నను వీడే మనసున దయమానీ 

నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే


లీలాకృష్ణా కొలనిలో కమలములా కన్నెమది 

తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నదీ 

అల్లరి కన్నా దోచుకో కమ్మని ఆశల వెన్న ఇదీ 

అందరికన్నా ముందుగా తన వైపే రమ్మన్నదీ 

విన్నావా చిన్నారీ ఏమందో ప్రతిగోపికా 

చూస్తూనే చేజారే ఈ మంచి వేళ మించనీక 

త్వరపడవమ్మా సుకుమారి ఏమాత్రం ఏమారకా 

వదిలావో వయ్యారీ బృందావిహారి దొరకడమ్మ 


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా


గోపికమ్మా చాలును లేమ్మా నీ నిదరా

గోపికమ్మా నిను వీడనీమ్మా మంచు తెరా


Share This :



sentiment_satisfied Emoticon