గోపాల కృష్ణుడమ్మా లోకాల కిష్టుడమ్మా పాట లిరిక్స్ | నాలో ఉన్న ప్రేమ

 చిత్రం : నాలో ఉన్న ప్రేమ

సంగీతం : కోటి

సాహిత్యం : సిరివెన్నెల (?)

గానం : బాలు, చిత్ర


జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద

జయ కృష్ణ కృష్ణ జయ కృష్ణ కృష్ణ


గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 

అదిగదిగదిగో చూడమ్మా.. 

మన అలికిడి వినబడితే రాడమ్మా 


గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 

అదిగదిగదిగో చూడమ్మా.. 

మన అలికిడి వినబడితే రాడమ్మా 


జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 


ఘల్లు ఘల్లుమంటు నల్లనయ్య 

మువ్వసడీ వింటే సరి.. 

అణువణువున విరియద నెమలి పురి. 

ప్రతీ వారి ఊపిరిలో పిల్లంగ్రోవి రాగాలూ

ప్రతీవారి చూపులో ఎన్నో వేల స్వప్నాలూ

రాసలీల ఆడే వేళలో


జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 


గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 

అదిగదిగదిగో చూడమ్మా.. 

మన అలికిడి వినబడితే రాడమ్మా 


ఝల్లు ఝల్లు ఝల్లుమంటు 

కన్నె గుండె తుళ్ళిపడదా కనువిందుగా 

నల్లమబ్బు కిందికొచ్చి అందె కట్టి ఆడుతుండగా 

ప్రతి కన్నె గోపికలా ప్రతీ కన్ను దీపికలా 

ప్రతి తల్లి యశోదలా ప్రతీ ఇల్లు పూపొదలా 

మారిపోయి మురిసే వేళలో.. 


జయ కృష్ణ కృష్ణ హే గోవింద 

జయ కృష్ణ కృష్ణ హే గోవింద 


గోపాల కృష్ణుడమ్మా.. లోకాల కిష్టుడమ్మా 

అదిగదిగదిగో చూడమ్మా.. 

మన అలికిడి వినబడితే రాడమ్మా 

Share This :

Related Post



sentiment_satisfied Emoticon

:)
:(
hihi
:-)
:D
=D
:-d
;(
;-(
@-)
:P
:o
-_-
(o)
[-(
:-?
(p)
:-s
(m)
8-)
:-t
:-b
b-(
:-#
=p~
$-)
(y)
(f)
x-)
(k)
(h)
(c)
cheer
(li)
(pl)